మురిపాల ముకుందా... ఆ... సరదాల సనందా.
మురిపాల ముకుందా సరదాల సనందా
మురిపాల ముకుందా సరదాల సనందా
పొద పొదలోన దాగుడుమూతలాపరా
యెద యెదలోన నర్తించింది చాలురా
అలసట నిను కోరి నిలుచుందిరా
కన్నా నిదురించరా. నా కన్నా నిదురించరా.
చిటికెన వేలిని కొండను మోసిన
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
చిలికిన చల్లల కుండలు దోచిన
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా...
పా సా దా నిసని గపమగ రిపమగరిసా
సనిపదస పమగరి దాపమగరిగదా
దపమగరి దపా మగరి సనిద గరిసరిద
దసదసరి గరిసరిదాసా గపమగరీదా
పమగరి సససస సససస ససససరిగపదరిస
గోపెల వలువలతో చెలగి అలసేవేమో గోముగ శయనించు
ఉంగిలి వెన్నలకై ఉరికే ఉబలాటముకే ఊరట కలిగించు
శ్యా.........మనా... మో..........హనా.
చాలు చాలు నీ అటుమటలు
పవళించక తీరవు అలసటలు
విరిసె మదిలో విరిశయ్యలు
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా...
నెర నెర చూపులకే కరిగి కదిలి నీకై బిర బిర వచ్చితినే
తడి తడి కన్నులతో నీపై వాలి సోలి తమకము తెలిపితినే
మా.........ధవా...
యా.......దవా...
నా మతి మాలి దోషము జరిగే
ఓ వనమాలి ఎద్దు నిన్ను పొడిచే
పాపం అంతా నాదేనురా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా
కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా...
మురిపాల ముకుందా సరదాల సనందా
మురిపాల ముకుందా సరదాల సనందా
మదనా మధుసూదనా మనోహరా మన్మోహనా
మదనా మధుసూదనా మనోహరా మన్మోహనా
మురిపాల ముకుందా సరదాల సనందా
ఆనందా అనిరుద్ధా. ఆనందా అనిరుద్ధా.
కన్నా కన్నా కన్నా...
కృష్ణా రాధా రమణా
కన్నా నిదురించరా.
Song Discussions is protected by U.S. Patent 9401941. Other patents pending.